దంచి కొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం

VKB: వికారాబాద్ పట్టణంలో ఆదివారం సాయంత్రం భారీ కుంభవృష్టి కురిసింది. ఉరుములతో కూడిన ఈ వర్షానికి రోడ్లన్నీ జలమయమై ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, ఈ భారీ వర్షం పంటలకు మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం, మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.