'ఇసుక అక్రమ తవ్వకాలు పై ఎన్జీటీకీ ఫిర్యాదు చేస్తా'

SKLM: ఇసుక అక్రమ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)కు ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. హిరమండలం మండలంలోని భగీరథపురం, పిండ్రువాడ గ్రామాల మధ్య వంశధార నదిలో ఇసుక తవ్వకాలు ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ.. ఇసుక దోపిడీ అడ్డగోలుగా సాగుతుందని ఆమె తెలిపారు.