విజయవాడలో 'కోటి సంతకాల సేకరణ'
NTR: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవాడలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా తూర్పు నియోజకవర్గంలో 95 వేలకు పైగా సంతకాలు పూర్తయ్యాయని జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.