VIDEO: ఆన్‌లైన్ గేమ్.. యువకుడి ఆత్మహత్యాయత్నం
WGL: రాయపర్తి మండలం టెట్టకుంట తండాలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. పత్తి అమ్మి వచ్చిన డబ్బులు ఫోన్‌పేలో ఉండగా యువకుడు తండ్రి ఫోన్ తీసుకుని గేమ్ ఆడి లక్ష రూపాయలు పోగొట్టాడు. ఈ విషయమై తండ్రి మందలించడంతో కుమారుడు ఇస్లావత్ సాయికిరణ్(22) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి అతడిని ఆసుపత్రికి తరలించారు.