కష్టాల్లో తోడుగా.. యువ ఆపద మిత్ర వాలంటీర్లు.!
హైదరాబాద్ వరదలు, విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలకు సహాయం అందించడం కోసం యువత ముందుకు రావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఇందులో భాగంగానే ' యువ ఆపద మిత్ర వాలంటీర్ల' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనతోపాటు మన సమాజం కోసం కొంత చేయూత అందించాలన్నారు. ప్రోగ్రాంలో చేరిన వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ అందించారు.