యువతకు కేంద్రమంత్రి కీలక పిలుపు
అబ్దుల్ కలాం వంటి మహనీయుల స్ఫూర్తితో యువత సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలోకి రావాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్ సంకల్పాన్ని సాధించడంలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. త్వరలోనే మేడ్ ఇన్ ఇండియా విమానాలు గగనవిహారం చేస్తాయని చెప్పారు. విమానయాన రంగంలో స్వయం సమృద్ధి సాధించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని తెలిపారు.