విషాదం.. నీటి సంపులో పడి చిన్నారి మృతి

విషాదం.. నీటి సంపులో పడి చిన్నారి మృతి

SDPT: నీటి సంపులో పడి రెండేళ్ల బాలిక మృతి చెందిన ఘటన చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన గవ్వల పద్మ, రవిల కుమార్తె అరుణ్ తేజ (2) మంగళవారం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ఇంటి ముందున్న నీటి సంపులో పడిపోయింది. తల్లి నీళ్ల కోసం వెళ్లగా పాప మృతదేహం కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఘటనపైవి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.