చొప్పదండిలో రైతులకు అవగాహన శిబిరం
KNR: చొప్పదండి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో షణ్ముఖ అగ్రిటెక్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన శిబిరం నిర్వహించారు. శాస్త్రీయ నేల పరీక్షలు, ఎరువుల సరైన వినియోగం, ఆధునిక సాగు పద్ధతులు, తెగుళ్ల నివారణ, ప్రభుత్వ పథకాలపై నిపుణులు వివరించారు. డ్రిప్, స్ప్రింక్లర్ విధానాలు, పంట బీమా, సబ్సిడీ పథకాలపై మార్గదర్శనం చేశారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.