రైతన్న మీకోసం వారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రైతన్న మీకోసం వారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: కంభం మండలంలోని జగంగుంట్ల గ్రామంలో మంగళవారం నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు మేళ తాలాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతులతో ఎమ్మెల్యే సమావేశమై వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.