సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 16న జరిగే మండల, మున్సిపల్ సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎండల దృష్ట్యా సభల వద్ద నీడ, తాగునీరు కల్పించాలని, ఉదయం 10:30 గంటలకే ముగించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూనే, ప్రజల అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.