వికలాంగుల పెన్షన్లు పునరుద్ధరించాలి: సీపీఐ

వికలాంగుల పెన్షన్లు పునరుద్ధరించాలి: సీపీఐ

TPT: వికలాంగుల పెన్షన్లు రద్దు చేసిన వారందరికీ వెంటనే పునరుద్ధరించాలని సీపీఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ ఎన్.మౌర్యకు వినతిపత్రం అందజేశారు. అర్హులైన వికలాంగులందరికీ సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి పరిశీలించి, పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.