జాతీయ అథ్లెటిక్స్‌లో ఏపీ జట్టుకు నాగమణి ప్రాతినిధ్యం

జాతీయ అథ్లెటిక్స్‌లో ఏపీ జట్టుకు నాగమణి ప్రాతినిధ్యం

KRNL: ఆదోని ఛాగి పంచాయతీ కార్యదర్శి ఎస్. నాగమణి బిహార్‌లో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర స్థాయి పరుగు పందెం, ఖోఖో పోటీల్లో విజయం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. పాట్నాలోని పాటాలిపుత్ర స్టేడియంలో జరిగిన 4×400 మీటర్ల పరుగు పందెంలో ఏపీ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది.