మరకత లింగేశ్వరుడిని దర్శించుకున్న పొన్నం
SDPT: మహా శివరాత్రి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ కాశి మరకత లింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరకత లింగేశ్వరుని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పొన్నం అన్నారు. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.