నేటి నుంచి భారత్‌-రష్యా 'ఎక్సర్‌సైజ్‌ జాపడ్‌'

నేటి నుంచి భారత్‌-రష్యా 'ఎక్సర్‌సైజ్‌ జాపడ్‌'

భారత్‌-రష్యా బలగాలు ఇవాళ్టి నుంచి 16 వరకు ఆపరేషన్ జాపడ్ పేరిట సైనిక విన్యాసాల్లో పాల్గొంటాయి. సంప్రదాయ యుద్ధరీతులు, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల కోసం మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా వ్యూహాలను మార్పిడి చేసుకుంటాయని భారత రక్షణశాఖ వెల్లడించింది. ఇందుకోసం భారత సైన్యానికి చెందిన 65 మందితో కూడిన బృందం రష్యాకు వెళ్లింది. ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం అవుతాయని పేర్కొంది.