VIDEO: కన్నుల పండగగా అయ్యప్ప పల్లకి సేవ ఊరేగింపు
ADB: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో అయ్యప్ప స్వాముల పల్లకి సేవ ఊరేగింపు శుక్రవారం కన్నుల పండగగా సాగింది. పల్లకిలో అయ్యప్ప ఉత్సవ విగ్రహాన్ని పూలతో అలంకరించి గ్రామంలోని స్థానిక రామాలయం నుంచి మొదలైన పల్లకి ఊరేగింపు భక్తి గీతాల నడుమ అయ్యప్ప స్వాములు, మహిళలు నృత్యాలు చేస్తూ.. మంగళ హారతులతో ఘనంగా సాగింది. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.