భారత స్పిన్నర్లతో ముప్పు: ఇంగ్లండ్ కెప్టెన్

భారత స్పిన్నర్లతో ముప్పు: ఇంగ్లండ్ కెప్టెన్

రేపు భారత్‌తో జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత స్పిన్నర్ల నుంచి తమ జట్టుకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందన్నాడు. నెంబర్ వన్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం తమ బ్యాటర్లకు సవాలేనని, అతని బౌలింగ్‌లో పరుగులు రాబట్టడం కష్టమని చెప్పాడు. స్పిన్నర్లను ఆడటంలో తమకు మంచి రికార్డు లేదని గుర్తు చేశాడు.