మగాడిపై నలుగురు లైంగిక దాడి!
TG: HYDలో ఓ మగాడిపై నలుగురు పురుషులు లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్‌కి చెందిన ఓ పెయింటర్‌ను అర్ధరాత్రి.. మద్యం మత్తులో ఉన్న నలుగురు కారులో ఎక్కించుకున్నారు. ఆ పెయింటర్‌ను లైంగికంగా వేధించి.. నాచారం పారిశ్రామికవాడలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి చంపేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.