అంబరాన్నంటిన బీజేపీ శ్రేణుల సంబరాలు

ఆదిలాబాద్: కుంటాల మండలంలో బీజేపీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటాయి. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ఘన విజయం సాధించడంతో కల్లూరు గ్రామంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కాబోతున్నారని హర్షం వ్యక్తం చేశారు. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.