నేడు పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం

నేడు పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం

WNP: పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివని వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి అన్నారు. పోలీస్ అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని యువతీ, యువకులు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొనాలని ఆయన కోరారు.