యాదగిరిగుట్ట దేవస్థానం మంగళవారం ఆదాయం
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.5,14,010, కార్ పార్కింగ్ రూ.2,20,500, VIP దర్శనాలతో రూ.1,05,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,07,400, ప్రధాన బుకింగ్ రూ.1,50,904, వ్రతాలతో రూ.59,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.13,53,942 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.