'కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టండి'
SRPT: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా యావత్ కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ సూర్యాపేట జిల్లా కోశాధికారి కోటగిరి వెంకట్ నారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం కోదాడ పట్టణంలో సీఐటీయూ కార్యాలయంలో 4వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.