మున్సిపాలిటీని సందర్శించిన ఆర్డీవో
MDK: తూప్రాన్ మున్సిపాలిటీలోని 14వ వార్డును ఆర్డీవో ఎం. జయచంద్ర రెడ్డి బుధవారం సందర్శించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న జనగణనను దృష్టిలో ఉంచుకుని, మున్సిపాలిటీలోని ప్రతి వార్డును బ్లాకులుగా విభజించాలని అధికారులకు సూచించారు. ప్రతి బ్లాక్‌లో గరిష్టంగా 800 మంది జనాభా ఉండేలా చూడాలని, తూప్రాన్ మున్సిపాలిటీని మొత్తం 40 బ్లాకులుగా విభజించాలని ఆయన ఆదేశించారు.