VIDEO: సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం

RR: షాద్‌నగర్ పట్టణ ముఖ్య కూడలిలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించడంపై రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.