అక్రమంగా నిల్వ ఉంచిన బానసంచా స్వాధీనం
ప్రకాశం: మార్కాపురం పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన బానసంచాను పట్టణ పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్సై సైదుబాబు బుధవారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించి రూ.60 వేలు విలువచేసే అక్రమ బానసంచాను సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా దీపావళి మందులను నిలవ ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.