ఏలూరులో పోలీసులు విస్తృత తనిఖీలు
ELR: ఢిల్లీలో చోటుచేసుకున్న బాంబు పేలుళ్ల సంఘటనను దృష్టిలో ఉంచుకుని సోమవారం రాత్రి ఏలూరులో కూడా బాంబు స్క్వాడ్ బృందం ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేశారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, SI మధు వెంకటరాజా, బాంబు స్క్వాడ్ సిబ్బంది పబ్లిక్ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.