ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని కలెక్టర్‌కు లేఖ రాసిన ఎమ్మెల్యే

JGL: మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌లో ఏర్పాటుచేసిన ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కలెక్టర్ సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. ఆ లేఖను అడిషనల్ కలెక్టర్ లతకు గ్రామస్థులు గురువారం అందజేశారు. ప్రజా విచారణ, పర్యావరణ అనుమతి లేకుండా జరుగుతున్న ఇసుక రవాణాకు గ్రామస్థులు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఇసుక రవాణాతో పర్యావరణ నష్టం జరుగుతుందన్నారు.