'ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో సంపూర్ణ ఆరోగ్యం'

అన్నమయ్య: ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఫోర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ లలితమ్మ అన్నారు. ఇవాళ తంబళ్లపల్లె మండలంలో రైతులతో ఆమె సమావేశం నిర్వహించారు. లలితమ్మ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు సమగ్రంగా తెలుసుకోవాలని సూచించారు. యాంత్రిక వ్యవసాయ స్థానంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు శ్రీకారం చుట్టాలన్నారు.