VIDEO: రొద్దంలో పంచాయతీ కార్మికులకు ట్రై సైకిళ్లు పంపిణీ
సత్యసాయి: రొద్దం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద పంచాయతీ కార్మికులకు శనివారం ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. మండల టీడీపీ కన్వీనర్ నరహరి ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు ట్రై సైకిళ్లను అందజేశారు. నరహరి మాట్లాడుతూ.. గ్రామాలలో పారిశుద్ధ్య పనులు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ట్రై సైకిళ్లు ఉపయోగపడతాయని తెలిపారు.