రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు
KMM: తిరుమలాయపాలెం మండలంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం.. మాదిరిపురం గ్రామానికి చెందిన రైనయే అనే యువకుడు బైక్ పై సుబ్లేడు నుంచి మాదిరిపురం వెళ్తుండగా సుబ్లేడు-మహ్మదాపురం గ్రామాల మధ్య కోతుల గుట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రైనయే స్వల్ప గాయలతో బయటపడ్డాడు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.