జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

బాపట్ల జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బుధవారం కలెక్టర్ వెంకట మురళి స్పష్టం చేశారు. అక్రమంగా యూరియా నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించి రైతులను భయభ్రాంతులకు గురిచేసే వారిపై పీడీ యాక్ట్‌తో సహా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెప్టెంబర్ నెలలో జిల్లాకు 6,759 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని అంచనా వేశారు.