రేపు కవ్వాల్‌లో ఉపాధి హామీ పనులపై గ్రామసభ

MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామపంచాయతీలో ఈజీఎస్ పనులపై గ్రామసభ నిర్వహించనున్నామని పంచాయతీ సెక్రెటరీ విశ్వ తెలిపారు. కవ్వాల్ గ్రామంలో చేసిన ఉపాధి హామీ పనులపై సోమవారం ఉదయం 9 గంటలకు పంచాయతీ కార్యాలయ ఆవరణలో పనులపై ఆడిట్ గ్రామసభ ఉంటుందన్నారు. అందరూ హాజరై గ్రామ సభను విజయవంతం చేయాలని కోరారు.