కబడ్డీ ట్రోఫీ గెలుచుకున్న ఓల్డ్ సిటీ టీం

NLG: జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఓల్డ్ సిటీ జట్టు మొదటి బహుమతి గెలుచుకుంది. ముఖ్య అతిథిగా DSP శివరాం రెడ్డి హాజరై బహుమతులు ప్రదానం చేశారు. క్రీడలతో స్నేహభావం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.