ఎన్నికల కోడ్.. 'ప్రజావాణి' రద్దు

ఎన్నికల కోడ్.. 'ప్రజావాణి' రద్దు

వనపర్తి జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కారణంగా నేడు నిర్వహించే 'ప్రజావాణి' కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలు కోడ్ ముగిసే వరకు 'ప్రజావాణి' కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయంలో జిల్లా ప్రజలు సహకరించాలని, ఫిర్యాదుల కోసం ఎవరు రావొద్దని విజ్ఞప్తి చేశారు.