ధ్యానంతోనే ప్రశాంతత: ఎంజీయూ వీసీ
NLG: ధ్యానం ద్వారానే మానసిక ప్రశాంతత లభిస్తుందని మహాత్మా గాంధీ వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. డిసెంబరు 21న నిర్వహించనున్న 'ప్రపంచ ధ్యాన దినోత్సవం' గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిత్యం ధ్యానం చేయడం వల్ల ఉత్సాహం పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఉన్నత వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.