విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి

విద్యుత్ షాక్‌తో  యువ రైతు మృతి

NRPT: మాగనూరు మండలంలోని అచ్చంపేట గ్రామంలో శుక్రవారం రాత్రి విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన దేవప్ప(32) తన వ్యవసాయ పొలంలో స్టార్టర్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఉదయం పొలం దగ్గరికి వెళ్లి చూడగా విద్యుత్ షాక్‌తో చనిపోయినట్లు గుర్తించారు.