విజయవాడ నుంచి హజ్ యాత్ర: ఎమ్మెల్యే నసీర్

విజయవాడ నుంచి హజ్ యాత్ర: ఎమ్మెల్యే నసీర్

గుంటూరు: హజ్ యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. అంజుమన్ షాదీఖానాలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వచ్చే ఏడాది నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి హజ్ ప్రయాణం ఏర్పాటు చేసి, ప్రత్యేక హజ్ హౌస్ నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రతి యాత్రికుడికి రూ.1 లక్ష సహాయం అందిస్తామని పేర్కొన్నారు.