పనులు చేయరు.. బిల్లులు మాత్రం లేపేస్తారు!
KNR: సీసీ రోడ్లు పూర్తి చేయకుండానే MB రికార్డులు చేసి సర్పంచ్లు అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌లో ఉపాధి హామీ పథకంలో రూ.27.63 కోట్లతో మంజూరైన 397 పనులు పూర్తి చేయడానికి 10 రోజుల గడువే ఉండడంతో కొందరు నాణ్యతలేని పనులు చేయగా, మరికొందరు పనులు చేయకుండానే బిల్లులు క్లెయిమ్ చేస్తున్నారు.