ఆత్మహత్య చేసుకుంటున్న యువకుడును కాపాడిన పోలీసులు

VSP: విశాఖ అప్పుఘర్ బీచ్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడుతున్న యువకుడును ఎంవీపీ పోలీసులు కాపాడారు అనంతరం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయగా యువకుడు భీమిలి మండలం ఉప్పాడకు చెందిన మామిడి సంతోష్(30)గా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నాడని తెలుసుకొని అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబీకులకు తెలుపగా భార్య పోలీసులకు కృతజ్ఞతలు తెలియపారు.