'లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

BHPL: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.