డిగ్రీ కళాశాలలో మేరా యువ భారత్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం
NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం మేరా యువ భారత్ కోవూరు బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ 2025-26 కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుజాత షార్ట్ పుట్ క్రీడతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్త్రీ పురుషులకు ఖో -ఖో, రన్నింగ్, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. అనంతరం గెలిచిన వారికి బహుమతులను అందజేశారు.