తూనిక యంత్రాలకు సీళ్లు తప్పనిసరి..

SKLM: తూనికల, కొలతల శాఖ ఆధ్వర్యంలో తూనిక యంత్రాలకు సీళ్లు ప్రభుత్వ నిబంధనల మేరకు తప్పనిసరిగా వేసుకోవాలని ఆ శాఖ ఇన్స్‌పెక్టర్ బాలరామకృష్ణ తెలిపారు. నరసన్నపేట మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ కల్యాణ మండపంలో స్థానిక వ్యాపారస్తుల తూనికల యంత్రాలకు సీళ్లు వేసే కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన గురువారం తెలియజేశారు. వీటిని వేసుకోకపోతే చర్యలు తప్పమన్నారు.