దాడిని ఖండించిన టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు

KDP: ఖాజీపేట మండలానికి చెందిన రాష్ట్ర ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ పక్కిరిపల్లె నాగరాజు తిరుపతిలో ఎస్సీ కులానికి చెందిన పవన్‌పై జరిగిన దాడిని ఆదివారం ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తిరుపతి పట్టణంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దినేష్ రెడ్డి, అనిల్ రెడ్డిలు పవన్‌పై దారుణంగా దాడి చేసిన ఘటనను ఖండిస్తున్నామన్నారు.