'వేములవాడ ఆలయాన్ని మూసి వేయడం సరికాదు'
SDPT: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా మూసివేయడం సరికాదని గజ్వేల్ శ్రీ రామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల నెపంతో కార్తీక మాసంలో ఆలయాన్ని బంద్ చేయడం భగవంతునికి భక్తునికి దూరం చేయడమేనని తెలిపారు. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయరాదన్నారు.