VIDEO: విషాదం.. కాలువలో పడి టెన్త్ క్లాస్ విద్యార్థి మృతి
NLR: జిల్లాలోని అనంతసాగరం మండలం గౌరవం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన చిలికా కుశాంత్ అనే 10వ తరగతి విద్యార్థి సోమశిల ఉత్తర కాలువలో పడి మృతి చెందాడు. ఎల్లుండి పరీక్షలు ముగిస్తుండగా విద్యార్థి చనిపోవడంతో గ్రామంలోని అందరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. గ్రామంలోని గజ ఈతగాళ్లు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.