పాలిటెక్నిక్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

పాలిటెక్నిక్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

GDWL: దుర్గాబాయి దేశముఖ్ మహిళా సాంకేతిక శిక్షణా సంస్థలో పాలిటెక్నిక్ కోర్సులకు ప్రవేశాల కోసం బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలు, నిరాశ్రయులు, చైల్డ్ హోమ్స్‌లోని వారు, దివ్యాంగ బాలికలు ఈ కోర్సులకు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.