సోమందేపల్లిలో హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం
సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం హెల్మెట్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమందేపల్లి SI రమేశ్ బాబు ఆధ్వర్యంలో వాహనదారులను ఆపి హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి ఫైన్ వేయకుండా వారి డబ్బులతో హెల్మెట్ కొనుగోలు చేసి అందజేశారు. వాటిని తప్పకుండా ధరించాలని సూచించారు.