పెళ్లి వేడుకలో ప్రత్యక్షమైన తులసి బాబు
కృష్ణా: RRR దాడి కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన గుడివాడ MLA వెనిగండ్ల రాము సన్నిహితుడు కామేపల్లి తులసి బాబు మరోసారి చర్చనీయాంశంగా మారాడు. TDP అధిష్టానం సూచనలతో తులసిని దూరంగా ఉంచాలని MLAకు చెప్పిన తర్వాత గుడివాడలో కనిపించని ఆయన, తాజాగా జైలు నుంచి విడుదలై లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ రాజు కుమారుడి వివాహ వేడుకలో కనిపించడం ఆసక్తి రేపుతోంది.