మంత్రి లోకేష్‌తో ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్
KRNL: మంత్రి లోకేష్‌ను ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. లోకేష్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ బలోపేతానికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ అభివృద్ధి పనుల అమలు విధానం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.