భద్రత వైఫల్యం పై విచారణ జరపాలి: ప్రశాంతి రెడ్డి

భద్రత వైఫల్యం పై విచారణ జరపాలి: ప్రశాంతి రెడ్డి

నెల్లూరు: చిలకలూరిపేట బొప్పూడి వద్ద టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి రెడ్డి కోరారు. ప్రజాగళం సభకు పీఎం నరేంద్ర మోడీ హాజరవుతున్నారని తెలిసి కూడా ఆయా జిల్లాల అధికారులు నిర్లక్ష్యం వహించారన్నారు.