'సాగు నీటి సమస్య పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతాం'
KDP: పులివెందుల నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలకు నీళ్ళు ఇవ్వాలని ఎంపీ అవినాష్ డిమాండ్ చేశారు. వేముల, లింగాల మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, నీళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎందుర్కొంటున్నారన్నారు. అనంతరం ఆయన ఆర్డీవో కార్యాలయంలో అధికారులను కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. సాగు నీటి సమస్య పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతామని ఎంపీ పేర్కొన్నారు.